నేటి సాక్షి - జగిత్యాల
(పూరెళ్ల బాపు)
........................................
చిన్న కుమారుడి మరణం తర్వాత కోడలు కుటుంబం ఆస్తి, ఇన్సూరెన్స్ కోసం వేధిస్తూ ప్రాణభయం కల్పిస్తోందని ధర్మపురికి చెందిన వృద్ధ మహిళ దహగం దత్తప్రియ ఆరోపించారు.
ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు సోమవారం ప్రజావాణి ద్వారా, జగిత్యాల ఆర్డీఓ కు సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద వేరువేరుగా ఫిర్యాదు చేశారు.
తన చిన్న కుమారుడు స్వర్గీయ దహగం గిరీష్ గత ఏడాది ఏప్రిల్ 18న గుండెపోటుతో మరణించారని, అప్పటి నుంచి తన కోడలు కామోజ్జల మానస, ఆమె తండ్రి కామోజ్జల సత్యనారాయణ రావు, తల్లి రామోజ్జల వాగ్దేవి (ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, చల్లూరు, వీణవంక) తనపై ఒత్తిడి తెస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.బోయింగ్ కంపెనీకి చెందిన జిటిఎల్ ఇన్సూరెన్సులో తనకు 33 శాతం చట్టబద్ధ వాటా ఉందని, ఆ హక్కును వదులుకునేలా ఎన్ఓసి పై బలవంతంగా సంతకం చేయాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు.
సంతకం చేయకపోతే చంపుతామని బెదిరించారని ధత్తప్రియ తెలిపారు.
ఆగస్టు మొదటి వారంలో, అలాగే 15, 16, 17 తేదీల్లో ముగ్గురు తన ఇంటికి వచ్చి పరుష పదజాలంతో దూషించి రెండుసార్లు భౌతిక దాడికి యత్నించారని, దీంతో ప్రాణభయంతో పెద్ద కుమారుడు దహగం గణేష్ ఇంటికి వెళ్లి ఆశ్రయం పొందానని పేర్కొన్నారు.
తాను ఇంటి నుంచి వెళ్లిన తర్వాత కిరాణా వస్తువుల్లో గుర్తు తెలియని పొడి, నూనె లాంటి అనుమానాస్పద పదార్థం కనిపించిందని, ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో దీనిపై తీవ్ర అనుమానం ఉందని తెలిపారు.
తనకు అండగా ఉన్న పెద్ద కుమారుడు గణేష్, ఆయన భార్యను కూడా తప్పుడు కేసుల పేరుతో బెదిరిస్తూ తనను ఒంటరిని చేయాలని చూస్తున్నారని, తన సంతకాలను ఫోర్జరీ చేశారేమోనని విచారణ జరపాలని ఆమె కోరారు.
> "నాకు ప్రతీకారం వద్దు, నా చట్టపరమైన హక్కులు చాలని,కానీ పై ముగ్గురి వల్ల నా ప్రాణానికి ముప్పు ఉందని,ఏదైనా జరగకముందే రక్షణ కల్పించాలని దత్తప్రియ విజ్ఞప్తి చేశారు.
ఆస్తి వివాదం కోర్టులో ఉన్నప్పటికీ బలవంతంగా హక్కులు వదులుకునేలా చేస్తున్నారని, తనకు, తన భర్తకు రక్షణ కల్పించి నిష్పక్షపాత విచారణ జరపాలని ఆమె కోరారు.
Telangana
*ధర్మపురిలో వృద్ధురాలికి ప్రాణభయం* *ఆస్తి, ఇన్సూరెన్స్ కోసం కోడలు కుటుంబం వేధింపులు* *ప్రజావాణిలో వృద్దురాలు దత్తప్రియ ఫిర్యాదు* -----------------------------------------
Quick Summary:
*ప్రజావాణిలో వృద్దురాలు దత్తప్రియ ఫిర్యాదు*
