నేటి సాక్షి నారాయణపేట ఆగస్టు 24,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ),
నారాయణపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మిలాద్ ఉన్ నబి బందోబస్తు ఏర్పాట్లు మరియు పోలీస్ సంఘం ఎన్నికలు, లాంగ్ పెండింగ్ కేసులపై సమీక్షించారు.
సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...
బుధవారం రోజు జరిగే మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా జిల్లా పరిధిలో ముందస్తు శాంతి మత పెద్దలు, ఇతర శాఖ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి శాంతియుతంగా పండుగ జరుపుకునే విధంగా చూడాలని అలాగే జెండాలు కట్టే సమయంలో మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకొని జెండాలను ఏర్పాటు చేసుకునేలా చూడాలని ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా చూడాలని, మిలాద్ ఉన్ నబీ ర్యాలీలకు ముందస్తు పర్మిషన్ తీసుకునేలా చూడాలని, ప్రార్థన మందిరాల వద్ద ప్రటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, ర్యాలీ నిర్వహించి ప్రధాన మార్గాన సీసీ కెమెరాల నిఘా ఉంచాలని, డ్రోన్ కెమెరాలు, వీడియోగ్రఫీతో రికార్డు చేయాలని, ప్రధాన చౌరస్తాల వద్ద పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేయాలని, ర్యాలీ నలువైపులా బందోబస్తు ఉండాలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ పోలీసుల ప్రధాన బాధ్యత అని ప్రతి అధికారి సిబ్బంది సమన్వయంతో పనిచేసి పండుగ ప్రశాంతంగా నిర్వహించేలా కృషి చేయాలని ఎస్పీ సూచించారు.
పోలీస్ సంఘం ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి....
జిల్లా పరిధిలో మంగళవారం రోజు జరిగే పోలీస్ సంఘం ఎన్నికలు పారదర్శకంగా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని నోడల్ అధికారి డీఎస్పీ మహేష్, అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్, సీఐ లకు ఆదేశించారు. పోలీసు సంఘం ఎన్నికలు సర్కిల్ పోలీస్ స్టేషన్లో సర్కిల్ వారిగా నిర్వహించాలని మిగతా విభాగాలకు హెడ్ క్వాటర్స్, జిల్లా కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికలు సీసీ కెమెరా నిఘాలో నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. ఎన్నికల రోజు అందరూ యూనిఫాంలోనే ఐడి కార్డ్ తో రావాలని, బయట డ్యూటీలో ఉన్న పోలీసులకు వాట్సాప్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఉదయం 8:00 గంటల నుండి 2:00 గంటల వరకు ఎన్నికలను నిర్వహించి అనంతరం బ్యాలెట్ బాక్స్ లు ఎస్పీ కార్యాలయంలోనీ కౌంటింగ్ కేంద్రం వద్ద కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించాలని సూచించారు.
డిజిపి ఆఫ్ ఇయర్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్ కు అధికారులు అందరూ తగిన రిపోర్ట్స్ తో సన్నద్ధం కావాలని తెలిపారు. అలాగే జిల్లాలో లాంగ్ పెండింగ్ కేసులను, ప్రాపర్టీ దొంగతనం కేసులు, డీజీపీ ఆఫ్ ఇయర్లీ క్రైమ్ రివ్యూ సమావేశానికి అధికారులు అందరూ తమ పరిధిలోని నేరాలు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు తదితర అంశాలపై సమగ్ర నివేదికలతో సన్నద్ధంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.
జిల్లాలోని లాంగ్ పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, దర్యాప్తును వేగవంతం చేసి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అలాగే ప్రాపర్టీ దొంగతనం కేసుల్లో నేరస్తులను గుర్తించి, దొంగిలించిన ఆస్తులను రికవరీ చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
సీసీటీవీ లు, సాంకేతిక ఆధారాలను సమర్థవంతంగా వినియోగిస్తూ నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, పోలీస్ అధికారులు తమ పరిధిలోని కేసులపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఎస్పీ సూచించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీ మహేష్, సీఐ లు శివ శంకర్, రామ్ లాల్, భగవంత్ రెడ్డి, సైదులు, ఎస్ఐ లు వెంకటేశ్వర్లు సతీష్ రెడ్డి, నరేష్, విజయ్ కుమార్, రాజు, రమేష్, నవీద్, అశోక్ బాబు, గాయత్రి, రేవతి తది తరులు పాల్గొన్నారు.
Telangana
మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు..... పోలీస్ సంఘం ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి..... లాంగ్ పెండింగ్ కేసులపై ప్రత్యేక సమీక్ష.. .... నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ .....
Quick Summary:
లాంగ్ పెండింగ్ కేసులపై ప్రత్యేక సమీక్ష.. ....
