నేటి సాక్షి: మల్లాపూర్.
( రాజశేఖర్ బక్కూరి)
మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట గ్రామంలో ఉయ్యాల సుకుమార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో
అతని జన్మదినం సందర్భంగా హెల్మెట్లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉయ్యాల సుకుమార్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు సృజన్ కుమార్ మాట్లాడుతూ వారి బావ అయినటువంటి ఉయ్యాల సుకుమార్ హెల్మెట్ ధరించకుండానే బైకు యాక్సిడెంట్ లో చనిపోయాడు తన బావ లాగా ఇక ఎవరికి అలా కాకూడదు అనే ఉద్దేశంతో తన స్నేహితుల సహాయంతో *సుమన్ యూత్* ను 2019 లో స్థాపించారు. సుమన్ యూత్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఎన్నో సేవలు అందించారు. ఆపదలో ఉన్న వారికి రక్తదానం( బ్లడ్ క్యాంపులు), చలివేంద్రాల ఏర్పాటు, ఆకలితో ఉన్నవారికి అన్నదానాలు, చాలా గ్రామాలలో బస్సు షెల్టర్ లు, కూర్చోవడానికి బెంచీలు, ఇప్పటికే 300కు పైగా హెల్మెట్లు చాలామందికి ఉచితంగా ఇవ్వడం జరిగింది. సుమన్ యూత్ ఆధ్వర్యంలో తన స్నేహితులందరి సహకారంతో ఇట్టి కార్యక్రమాలను ఇప్పటివరకు చేయగలిగామని సుమన్ యూత్ వ్యవస్థాపకుడు సృజన్ తెలిపారు. భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి పనులు కూడా చేస్తామని చెప్పారు.
Telangana
*యువతకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి ఉయ్యాల సుకుమార్ మెమోరియల్ ట్రస్ట్*
Quick Summary:
మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట
